హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి'

KMR: జనగణనలో కులగణనను తప్పనిసరిగా చేపట్టి ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని BC సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద BCల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా BC విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు మాట్లాడుతూ.. బీసీ కులగణనను శాస్త్రీయ, పారదర్శక పద్ధతిలో నిర్వహించాలన్నారు.