హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూనియర్ కళాశాలలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

PDPL: మట్టి గణపతిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం అనే నినాదంతో గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీసీఈఈ బ్రాండ్ అంబాసిడర్ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కనకజ్యోతి హాజరై విద్యార్థినులకు విగ్రహాలు అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడవద్దని సూచించారు.