హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో శుక్రవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చుక్కబొట్ల మహేందర్ అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI జీవన్ రెడ్డి పేర్కొన్నారు.