హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

భద్రాద్రి: అన్నపురెడ్డిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఎస్పీ రోహిత్‌ రాజు వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌ రికార్డులు, నేరాల నమోదు, ఫిర్యాదుల రిజిస్టర్లు, పెండింగ్‌ కేసుల వివరాలను పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు పకడ్బందీగా అప్‌డేట్‌ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు.