హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ సాయుధ పోరాటం చారిత్రకం: సీపీఐ

HNK: హనుమకొండ బాలసముద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటం చారిత్రకమైందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నేతృత్వంలో ప్రజలు సాహసోపేతంగా పోరాడారని ఆయన అన్నారు. పోరాట అమరుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.