ADB: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్‌కులాల వారీగా జనగణన వెంటనే చేపట్టాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ పోరాట దీక్షకు మాజీ మంత్రి సంఘీభావం ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
బీసీ సబ్‌కులాల వారీగా జనగణన చేపట్టాలి: మాజీ మంత్రి


