హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీ గూడెంలో ఘనంగా జాగేయ్ మాతారి పండుగ

ADB: బేల మండలంలోని సైదుపూర్‌తో పాటు, పలు ఆదివాసీ గూడెంలో 'జాగేయ్ మాతారి' పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంటు రోగాలు, వైరస్ మహమ్మారిలు, విష జ్వరాలు గ్రామం నుంచి తొలగిపోవాలని కోరుతూ గ్రామస్తులు ప్రధాన వీధుల్లో జాగేయ్ మాతారి అంటూ నినాదాలు చేశారు. గ్రామ పొలిమేరలోని శివుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.