KRNL: సీ.బెలగల్ మండలం పోలకల్లు గ్రామంలో బుడ్డన్నకు చెందిన మూడు గడ్డివాములు నిన్న రాత్రి దగ్ధమయ్యాయి. బాధితుడి వివరాల మేరకు సుమారు రూ.6 లక్షలు వెచ్చించి పశుగ్రాసం కొనుగోలు చేసి వాములు ఏర్పాటు చేసుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు
ఆంధ్రప్రదేశ్
పోలకల్లులో గడ్డి వాములకు నిప్పు


