PDPL: ధర్మారం మండలం కానంపల్లిలో శుక్రవారం మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 105 మంది రోగులకు బీపీ, షుగర్, మొదలైన పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్ సుస్మిత తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కాణంపల్లిలో ఉచిత వైద్య శిబిరం


