హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లి హత్య కేసులో జీవిత ఖైదు

KNR: ఆస్తి వివాదంలో తల్లి, తమ్ముడిపై రోకలి బండతో దాడి చేసి తల్లిని హత్య చేసిన అగుర్ల లింగయ్యకు కరీంనగర్‌ కోర్టు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధించింది. 2022లో ఇరుకుల్లలో జరిగిన ఘటనపై రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేసి నేరాన్ని రుజువు చేశారు. 2026లో కమిషనరేట్‌ పరిధిలో ఇది 21వ కేసులో శిక్ష పడినట్లు పోలీసులు తెలిపారు.