హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవిష్యత్‌ తరాలకు పచ్చని తెలంగాణను అందించాలి: ఎమ్మెల్యే

ఖమ్మం: అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌ తరాలకు పచ్చని తెలంగాణను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.