హైదరాబాద్: 28°C
క్రీడలు

తమ సత్తా నిరూపించుకోవడమే లక్ష్యం: జపాన్ కెప్టెన్

జపాన్ క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 22 మైలురాయిగా నిలవనుంది. చరిత్రలో తొలిసారి భారత్‌తో టీ20 మ్యాచ్ ఆడబోతున్నట్లు ఆ జట్టు కెప్టెన్ కెండెల్ కడోవాకి తెలిపాడు. 'ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో పోటీపడటం గొప్ప అనుభూతినిస్తుంది. కేవలం ఆస్వాదించడమే కాకుండా ఓ జట్టుగా తమ సత్తా నిరూపించుకోవడమే లక్ష్యం' చెప్పాడు. ఈ మ్యాచ్ జపాన్‌లో క్రికెట్ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నాడు.