హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహస్య తనిఖీల్లో లడ్డూ స్కామ్ బట్టబయలు

MBNR: చిన్నచింతకుంట శ్రీ కురుమూర్తి స్వామి ఆలయంలో విక్రయించే లడ్డూ ప్రసాదం బరువులో వ్యత్యాసం ఉండటంతో తూనికల కొలతల శాఖ అధికారి రవీందర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 100 గ్రాములకు గాను లడ్డూ 84 గ్రాములే ఉండటంతో భక్తులను మోసం చేస్తున్న గుత్తేదారుపై కేసు నమోదు చేశారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారమే ప్రసాదాల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.