హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'

SRCL: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.