KNR: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపి ఉన్నత స్థాయికి ఎదగాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోటా విద్యాసంస్థల ప్రాంగణంలో 70వ ఎస్జీఎఫ్ వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, 'ఫిట్ ఇండియా'తో క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: మేయర్


