హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై చర్యలు తీసుకోవాలి'

KNR: ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసర పరీక్షలు, అధిక ఫీజులు, మందుల పేరుతో అదనపు వసూళ్లను అరికట్టాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స, పరీక్షల ధరల పట్టికను ప్రదర్శించాలని, బిల్లింగ్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో నిఘా పెట్టాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.