హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐజ-గద్వాల్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా

GDWL: విద్యుత్ సరఫరా సరిగా లేక పంటలు ఎండిపోతున్నాయని మల్దకల్ మండల కేంద్రంలో రైతులు శుక్రవారం ఐజ-గద్వాల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న ఎస్సై కొండ శ్రీహరి రైతులతో మాట్లాడి సమస్యను విద్యుత్ ఏఈ రాజేష్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.