హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిటైర్డ్‌ ఆర్మీ హవల్దార్‌ నుంచి ఆయుధాల స్వాధీనం

HYD: సికింద్రాబాద్‌ బొల్లారం 20 మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసును TG సీఐ సెల్‌, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, మల్కాజ్‌గిరి పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. రిటైర్డ్‌ ఆర్మీ హవల్దార్‌ స్కూటీపై ఆయుధాలు తరలించినట్లు గుర్తించారు. నాగర్‌కర్నూల్‌లో నిందితుడి నుంచి 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, నైట్‌విజన్‌ పరికరాలు, 1,900కు పైగా తూటాలు స్వాధీనం చేసుకున్నారు.