హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోర్‌వెల్ పనులు ప్రారంభం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

MDCL: అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి డివిజన్‌ సంజీవరెడ్డి గార్డెన్స్ సమీపంలోని ముక్తిధామం శ్మశానవాటికలో నూతన బోర్‌బావి పనులను శుక్రవారం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రారంభించారు. అనంతరం మచ్చబొల్లారం యాదవ సంఘం వద్ద లబ్ధిదారులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.