హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి ఉత్సవాల్లో తప్పు చేస్తే సహించేది లేదు: సీఐ

BDK: మణుగూరు మండలంలో గణపతి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని సీఐ నాగబాబు నిర్వాహకులకు శుక్రవారం సూచించారు. ఉత్సవాల్లో తప్పులు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘర్షణలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా ఘటన జరిగితే కమిటీ సభ్యులదే బాధ్యత అని స్పష్టం చేశారు. సంతోషంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలని కోరారు.