BHNG: భువనగిరి వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు భువనగిరి పట్టణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బిజ్జల మహేష్, ప్రధాన కార్యదర్శి జంగాల హనుమంతరావు, ఆకుల రమేష్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
తెలంగాణ
భువనగిరి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం


