హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాషిష్ ఆయిల్‌ రవాణా గుట్టురట్టు

RR: మహేశ్వరం ఎస్‌ఓటీ, కందుకూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో హాషిష్ ఆయిల్‌ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.1.50 కోట్ల విలువైన 11 కిలోల హాషిష్ ఆయిల్‌, రెండు మొబైల్‌ ఫోన్లు, మారుతీ స్విఫ్ట్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. లంబసింగి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా నిందితులను పట్టుకున్నారు.