హైదరాబాద్: 28°C
తెలంగాణ

డెంగీ కేసు.. అప్రమత్తమైన వైద్య శాఖ

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సద్దలగుండు ప్రాంతంలో డెంగీ కేసు నమోదవడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ. శ్రీనివాసులు శుక్రవారం ప్రాంతాన్ని సందర్శించి లార్వా నిర్మూలన చర్యలను పరిశీలించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు.