SRD: అన్నారం ZPHSలో జీవశాస్త్ర ఉపాధ్యాయిని వాకిట శ్రీదేవి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులతో బంకమట్టితో వినాయక విగ్రహాలను తయారు చేయించారు. విద్యార్థుల సృజనాత్మకతను హెచ్‌ఎం పౌలీన అభినందించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని శ్రీదేవి సూచించారు.
తెలంగాణ
VIDEO: ZPHSలో మట్టి వినాయక విగ్రహాల తయారీ


