హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపాధ్యాయుల సేవలు అనన్యసామాన్యం'

MDK: సమాజ వికాసానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని మున్సిపల్ ఛైర్‌పర్సన్ లావణ్య నాగరాజు కొనియాడారు. రామాయంపేటలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో 19 మందిని ఘనంగా సన్మానించారు. ఎంఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. సర్కార్ బడుల్లో ఆంగ్ల బోధన అత్యుత్తమంగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.