హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మండపాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి'

HYD: వినాయక చవితి వేడుకల నేపథ్యంలో చార్మినార్ జోన్ పోలీసులు చత్రినాక PS పరిధిలో మండపాల నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. DCP కిరణ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. మండపాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, డీజేలపై నిషేధం ఉందని, లౌడ్ స్పీకర్లకు రాత్రి 10 వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సీసీటీవీలు, నాణ్యమైన విద్యుత్ తీగలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.