హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాకు జైలు కొత్త కాదు: పూల శ్రీనివాసరెడ్డి

సత్యసాయి: దొంగతనం, మోసం చేసో కాకుండా వైసీపీ కార్యకర్తల సంక్షేమం కోసమే తాను జైలుకు వెళ్లానని ఆ పార్టీ నాయకుడు పూల శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కదిరిలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్యకర్తలకు అర్ధరాత్రి అయినా అండగా ఉంటామని, కదిరిలో జరిగిన అక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.