హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం సబ్ డివిజన్లో సెక్షన్ 30 అమలు: DSP

W.G: నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల 11 నుంచి 30 వరకు సెక్షన్ 30 అమలులో ఉంటుందని డీఎస్పీ ఎం. సుధాకర్ రావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించరాదన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ముందుగా సబ్డివిజన్ పోలీసు అధికారి అనుమతి తీసుకోవాలని సూచించారు. జన సమీకరణతో కూడిన సమావేశాలు, లౌడ్‌స్పీకర్లు, డీజేలు కూడా నిషేధమన్నారు.