హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి

SKLM: టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైసీపీ ఇంఛార్జ్ పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆర్డీవోను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అలాగే నందిగాంలో ఒకరికే రెండేసి ఓట్లు ఉండటంపై, కొత్త పెన్షన్ల దరఖాస్తుల్లో వైసీపీ మద్దతుదారులపై చూపుతున్న వివక్షపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.