హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భక్తిశ్రద్ధలతో రామాలయ తృతీయ వార్షికోత్సవం

KDP: ముద్దనూరు మండలం రాఘవాపురంలోని రామాలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయం చుట్టూ కాషాయ జెండాలను ఏర్పాటు చేశారు. యువకులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో సందడి చేశారు. భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.