హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృత దేహాన్ని మాయం చేసేందుకు యత్నం

ప్రకాశం: మార్కాపురం మండలం గజ్జలకొండ పంచాయతీ పరిధి పడమటిపల్లిలో పొలానికి సుబ్బారెడ్డి కరెంట్‌ కంచె వేయడంతో పశువుల మేత కోసం వెళ్లిన రోడ్డ నారమ్మ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతదేహాన్ని సుబ్బారెడ్డి మాయం చేసేందుకు యత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.