BHNG: ఆలేరు మున్సిపాలిటీ 12వ వార్డు పోచమ్మగుడి ప్రాంతంలో కౌన్సిలర్ జెట్ట నీరజాసిద్ధులు ఆధ్వర్యంలో శుక్రవారం పండ్లు, పూల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం ఎంతో ముఖ్యమని వార్డు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో వార్డు అధికారి, మున్సిపల్ సిబ్బంది, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇంటింటికి మొక్కల పంపిణీ


