హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సబ్‌ కలెక్టర్

అన్నమయ్య: గణేష్ నవరాత్రుల నేపథ్యంలో పోలిచెరువు గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రాంతాన్ని రాజంపేట సబ్‌కలెక్టర్ హెచ్‌.ఎస్‌. భావన, మన్నూరు సీఐ లింగప్ప సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.