KMR: పిట్లం మండలం సిద్ధాపూర్ శివారు ప్రాంతంలో చిరుత దాడి కలకలం రేపింది. అన్నారం గ్రామానికి చెందిన రైతు కాశీరాం గేదె దూడపై చిరుత దాడి చేసింది. ఈ విషయంపై రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆఫీసర్లు సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి సంబంధించిన వివరాలను నమోదు చేసి పంచనామా నిర్వహించారు. అనంతరం నష్టపరిహారం కోసం రైతు నుంచి పరిహార దరఖాస్తును స్వీకరించారు.
తెలంగాణ
చిరుత దాడిలో గేదె మృతి!


