NGKL: తాడూరు (మం) సిరసవాడలో శుక్రవారం పెన్షన్ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఒంటరి మహిళ, వితంతు, వికలాంగుల పెన్షన్ కోసం 40 మంది దరఖాస్తు చేసుకోగా అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి త్యాగరాజ్ గౌడ్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ వాస శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన


