VSP: రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని పేర్కొంది. అలాగే, గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. దీనిని గమనించి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకి భారీ వర్ష సూచన


