ములుగు జిల్లా కేంద్రంలోని బాలసదనంలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలకు న్యాయ సేవాధికార సంస్థ ఎల్లవేళలా అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చండీశ్వరి దేవి అన్నారు. శుక్రవారం బాలసదనాన్ని సందర్శించి బాలికలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని కోరారు.
తెలంగాణ
'చిన్నారులకు అండగా న్యాయ సేవాధికార సంస్థ'


