హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

BPT: చీరాల 31వ వార్డులోని కారంచేడు రోడ్డు నుండి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు రూ. 79 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధితో పారిశుధ్యం మెరుగుపడుతుందని, చీరాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.