గద్వాల జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితుల పరిహారాన్ని, కులాంతర వివాహ ప్రోత్సాహకాలను తక్షణమే విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ. పరంజ్యోతి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చట్టప్రకారం 45 రోజుల్లో అందజేయాల్సిన పరిహారాన్ని ఇవ్వకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఎస్సీ, ఎస్టీ బాధితులకు పరిహారం ఇవ్వాలి


