హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్, HCL టెక్నాలజీస్, ఎటర్నల్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 103 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 4347 డాలర్ల వద్ద కొనసాగుతోంది.