హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం'

ADB: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అని ఎఫ్‌డీఓ ప్రథమేష్ కేశవ్ అన్నారు. శుక్రవారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని మావల పార్కులో ఉన్న స్తూపం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అటవీ సంపద సంరక్షణలో అమరవీరుల సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.