హైదరాబాద్: 28°C
తెలంగాణ

మర్రిపల్లిలో రైతులకు నానో ఎరువుల వినియోగంపై అవగాహన

SRCL: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో ఆత్మ కమిటీ డైరెక్టర్ జాగిరి సురేష్ ఆధ్వర్యంలో రైతులకు నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నానో ఎరువులను వాడే విధానాన్ని, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. సంప్రదాయ ఎరువుల కంటే ఇవి ఎంతగానో మేలు చేస్తాయని రైతులకు అవగాహన కల్పించారు.