హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రత్యేక విచారణ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్'

హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీమ్‌నగర్‌లోని 240వ పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ ఎన్. రవి శుక్రవారం పరిశీలించారు. ఎస్‌ఐఆర్‌–2026లో భాగంగా నో మ్యాపింగ్, అనామలీస్‌ జాబితాలోని ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న ధ్రువపత్రాలను త్వరగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.