హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొలాల అమావాస్య.. కంద మొక్కలకు డిమాండ్

KKD: శ్రావణమాసం చివరి రోజు వచ్చే అమావాస్యను పొలాల అమావాస్యగా పిలుస్తారు. ఈ సందర్భంగా ఇళ్లలో కంద మొక్కలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాకినాడ పిండాల సత్రం, రూరల్ ఇంద్రపాలెం, కలింగలు, పిఠాపురం ప్రాంతాల్లో పెద్దఎత్తున పితృకర్మలు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కర్మకాండల కోసం ప్రజలు తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది.