హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'

W.G: వినాయక చవితి పండుగను ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు లోబడి జరుపుకోవాలని నరసాపురం RDO దాసిరాజు, డీఎస్పీ ఎం. సుధాకర్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవ కమిటీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పండుగ ముసుగులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.