KMM: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను ఉపయోగించి వినాయక చవితిని జరుపుకోవాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాలను కమిషనర్ ప్రజలకు పంపిణీ చేశారు. వాతావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని పూజించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన కమిషనర్'


