హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్ కేంద్రాల్లో 'షీ' టీమ్స్ అవగాహన

WGL: నర్సంపేట పట్టణంలోని కుట్టు మిషన్ కేంద్రాల వద్ద షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై స్వాతి సూచించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, షీ టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. మహిళ భద్రతకు అధిక ప్రాధన్యత ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.