సత్యసాయి: పుట్టపర్తిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం, స్థానిక ప్రజా సమస్యలపై నాయకులు క్షేత్రస్థాయి చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై వైసీపీ విస్తృత స్థాయి సమావేశం


