హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు RBSK వైద్య పరీక్షలు

KNR: మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో RBSK ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు దంత పరీక్షలు, కంటి పరీక్షలు, రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించారు. దృష్టిలోపం, రక్తహీనత గుర్తించి తగిన సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకరయ్య, మెడికల్ ఆఫీసర్ మొగిలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.