KDP: పులివెందుల శ్రీపద్మావతి సమేత కళ్యాణ వేంకట రమణ స్వామి దేవస్థానానికి శనివారం ఉదయం 7 గంటలకు సమతామూర్తి ఆశ్రమం త్రిదండి చిన జీయర్ స్వామి నుంచి దివ్య కలశం రానుంది. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు భక్తులు దివ్య కలశాన్ని దర్శించి, స్పృశించి నమస్కరించే అవకాశం కల్పించనున్నారు. భక్తులు సంప్రదాయ దుస్తులతో ఆలయానికి రావాలని దేవస్థానం నిర్వాహకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పులివెందులకు శ్రీవారి దివ్య కలశం రాక


